Share News

చెక్కరథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:58 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు.

చెక్కరథంపై ప్రహ్లాదరాయలు
చెక్క రథంపై విహరిస్తున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు. మంగళవారం చైత్రమాస బహుళ నవమిని పురస్కరించుకొని శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆఽశీస్సులతో పండితులు, అర్చకులు రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహిం చారు. చెక్క రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళవాయిద్యాలు భక్తుల హర్షద్వానాల మధ్య ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల మంటపంలో ఊంజలసేవలో స్వామివారిని ఊగించారు. అంతకుముందు స్వామివారికి పాదపూజ చేసి పల్లకీలో ఊరేగించి హారతులు నిర్వహించారు. పండితులు సంస్థాన పూజలో భాగంగా మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకించారు.

Updated Date - Apr 23 , 2025 | 12:58 AM