Share News

స్వర్ణరథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:30 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహారించారు.

స్వర్ణరథంపై ప్రహ్లాదరాయలు
స్వర్ణ రథంపై విహరిస్తున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహారించారు. బుధవారం చైత్ర దశమి శుభదినం ను పురస్కరించుకొని శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆఽశీస్సులతో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టువస్ర్తాలతో బృందావనాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల, విద్యుతదీపాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తికి ఊంజల సేవ నిర్వహించారు. మఠం పండితులు భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. వివిధ రాష్ర్టాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో మంత్రాలయం కిక్కిరిసింది.

Updated Date - Apr 24 , 2025 | 01:30 AM