ప్రజాపత్రిక ఆంధ్రజ్యోతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:21 AM
అక్షరమే ఆయు ధంగా... ప్రజా సమస్యలే అజెండాగా... పాఠకుల ఆదరణ చురగొంటూ ఆంధ్రజ్యోతి పత్రిక దినదినాభివృద్ధి సాధిస్తోందని ‘బైక్ అండ్ కార్ రేస్’ విజేతలు కొనియాడారు.
ప్రజాదరణతో మరింత చేరువ
పాఠకుల్లో ప్రోత్సాహం కోసమే ‘బైక్ అండ్ కార్ రేస్’
విజేతలకు బహుమతుల ప్రదానం
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): అక్షరమే ఆయు ధంగా... ప్రజా సమస్యలే అజెండాగా... పాఠకుల ఆదరణ చురగొంటూ ఆంధ్రజ్యోతి పత్రిక దినదినాభివృద్ధి సాధిస్తోందని ‘బైక్ అండ్ కార్ రేస్’ విజేతలు కొనియాడారు. పాఠకులకు మరింత చేరువ కావడంతోపాటూ ఆంధ్రజ్యోతి కుటుంబంలో వారిని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి సంస్థ ‘కార్ అండ్ బైక్ రేస్’ లక్కీ డిప్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టింది. ఇటీవల కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీసులో లక్కీ డిప్ ద్వారా జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి బైకు, ద్వితీయ బహుమతి రిఫ్రిజిరేటర్, తృతీయ బహుమతి కలర్ టీవీ విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ విజేత డి.వీరేష్‌కుమార్, ద్వితీయ విజేత పువ్వాడ శంకర నారాయణ, తృతీయ విజేత సి.వెంకటేశ్‌లకు బుధవారం బహుమతులను అందజేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి మూడు బహుమతులతో పాటు ఆకర్షణీయమైన వంద కన్సోలేషన్ బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఎ.లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠకుల ఆదరాభిమానాలను చురగొంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన, పక్కా సమాచారంతో వార్తలు ఇచ్చేందుకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి అనునిత్యం ముందుంటోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్ నాయుడు, బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, డిప్యూటీ సర్కులేషన్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, ఏడీవీటీ మేనేజర్ జి.గోపాల్, సోనో విజన్ బ్రాంచ్ ఇన్‌చార్జి అచ్యుతరావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బహుమతులు అందుకున్న విజేతలు తమ ఆనందాన్ని ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
మరువలేని ఆనందం
ఆంధ్రజ్యోతి పాఠకుడిగా కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలో ప్రథమ విజేతగా నిలిచి బైక్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఫోన్ చేసి ఆంధ్రజ్యోతి లక్కీ డ్రాలో బైక్ గెలుచుకున్నావని చెప్పగానే నా ఆనందం మాటల్లో చెప్పలేకున్నాను. ఐదేళ్లుగా ఆంధ్రజ్యోతి పత్రికను చదువుతున్నాను. వార్తలు చాలా బాగా వస్తున్నాయి. ఆ వార్తలే నన్ను ఆంధ్రజ్యోతికి మరింత చేరువ చేసింది. బైక్ కొనుగోలుకు సంబంధించిన చెక్కును అందుకోగానే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్యూ ఆంధ్రజ్యోతి. - డి.వీరే్‌షకుమార్, వ్యాపారి, ప్రథమ విజేత, గూడూరు
పదేళ్లుగా ఆంధ్రజ్యోతి పాఠకుడిని
పదేళ్లుగా ఆంధ్రజ్యోతి పాఠకుడిగా ఉన్నాను. పత్రికలో ప్రతీ వారం ప్రచురితమయ్యే ‘ఆర్‌కే కొత్తపలుకు’ క్రమం తప్పకుండా చదువుతాను. నేను చిరుద్యోగిగా పనిచేస్తున్నాను. వార్తలు నాలో స్ఫూర్తిని రగిలించాయి. దమ్మున్న వార్తలు ప్రచురించడంలో ఆంధ్రజ్యోతికి మరోపత్రిక సాటిరాదు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఈ పత్రిక ప్రజల పక్షానే ఉంటుంది. అందుకే ఆంధ్రజ్యోతి అంటే ఎంతో ఇష్టం. కార్, బైక్ రైస్ లక్కీ డ్రాలో ద్వితీయ విజేతగా నిలిచి రిఫ్రిజిరేటర్ బహుమతిగా అందుకోవడం మరువలేని ఆనందాన్ని ఇచ్చింది. - పువ్వాడ శంకర నారాయణ, ద్వితీయ విజేత, నంద్యాల
బహుమానం అమ్మకు ఇస్తా
ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ లక్కీడ్రాలో జిల్లాలో తృతీయ విజేతగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నాకు కలర్ టీవీ బహుమతిగా ఇచ్చారు. మా ఇంట్లో టీవీ ఉంది. మా అమ్మకు టీవీ లేదు. చాలా రోజుల నుంచి అమ్మకు ఒక కొత్త టీవీ కొనివ్వాలని అనుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి బహుమతిగా ఇచ్చిన కలర్ టీవీని మా అమ్మకు బహుమతిగా ఇస్తాను. ఆరేళ్లుగా అంధ్రజ్యోతిని చదువుతున్నాను. జిల్లా పేజీలో వచ్చే వార్తలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నిర్భయంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వార్తాకథనాలు ప్రచురించడం ఆంధ్రజ్యోతికే సాధ్యం. ఆంధ్రజ్యోతి మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. - సి. వెంకటేశ్, తృతీయ విజేత, కోడుమూరు