Share News

విద్యారంగంలో సమూల మార్పులు

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:03 AM

రాష్ట్రంలో ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

విద్యారంగంలో సమూల మార్పులు
విద్యార్థినులకు భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభం

ఎమ్మిగనూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలురు, బాలికల కళాశాలల్లో ఎమ్మెల్యే బీవీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కళాశాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వె ంటనే తిరిగి జూనియర్‌ కళాశాలల్లో డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇది గ్రామీణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రసాద్‌, విజయరమణి, హెచఎంలో చిత్రావతి, కృష్ణమూర్తి, ఎంఈఓలు ఆంజనేయులు, మధుసూదన రాజు, హరి, రాజశేఖర్‌ రెడ్డి యల్లప్ప,శ్రీరామ్‌, టీడీపీ నాయకులు ముగతి ఈరన్న గౌడ్‌, కౌన్సిలర్‌ రామదాసు గౌడ్‌, జయన్న, ఇషాక్‌, అమాన, కనికే నాగరాజు, బీజేపీ నాయకులు నరసింహులు పాల్గొన్నారు.

మంత్రాలయం: విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడి,్డ జనసేన నియోజకవర్గ ఇనచార్జి బి.లక్ష్మన్న అన్నారు. శనివారం మంత్రాలయం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రమేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రాలయం సీఐ రామాంజులు, ఎంఈవో రాగన్న, ఎంపీడీవో శోభారాణి, హెచఎం వీరేష్‌, టీడీపీ నాయకులు వరదరాజులు, అశోక్‌ రెడ్డి, విష్ణువర్దన, రాఘవేంద్ర, ఎంపీటీసీ మేకల వెంకటేశ, మేకల నరసింహులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 01:03 AM