Share News

ఈ-వ్యర్థాల పునర్వినియోగాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి: మంత్రి

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:30 AM

ఈ-వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

ఈ-వ్యర్థాల పునర్వినియోగాన్ని  సామాజిక బాధ్యతగా తీసుకోవాలి: మంత్రి
ర్యాలీలో పాల్గొన్న మంత్రి టీజీ భరత, అధికారులు

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఈ-వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. స్థానిక అశోక్‌నగర్‌లో ఆంధ్రప్రదేశ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ-వ్యర్థాల నిర్వహణపై వార్డు కార్యదర్శులు, శానిటరీ కార్యదర్శులు, కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ చెత్తసేకరణ సమయంలోనే ఈ-వ్య ర్థాలను విభజించి సంబంధిత కార్మికులకు అందజేయాలని, దీనివల్ల వాటిని రీసైక్లింగ్‌ పునర్వినియోగం సులభతరమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజ నీర్‌ పీవీ కిషోర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, గ్రీన గ్లోబల్‌ రీసైక్లర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 01:30 AM