ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:33 AM
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయవద్దని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయవద్దని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ర్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్‌లో సబ్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని..
1. మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల రాజేశ్వరికి తనకు వితుంతు పింఛన్ మంజూరు చేయాలని ఆర్జీ సమర్పించుకున్నారు.
2. ఆదోని మండలం కుప్పగల్ గ్రామానికి చెందిన గోవర్దన్ తాను రేకులతో గుడిసెను నిర్మించుకున్నానని, విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నాయని, సమస్యను పరిష్కరించాలని అర్జీ సమర్పించుకున్నారు.
3. హొళగుంద మండలం ముగుమాను గొంది గ్రామానికి చెందిన గాది లింగ తన సర్వేయర్ నెం. 124ఏ నందు 4.57 ఎకరాల భూమి ఉందని, రీ సర్వే అనంతరం 4.29 ఎకరాల భూమి చూపుతోందని, న్యాయం చేయాలని అర్జీ సమర్పించుకున్నారు.
4. హొళగుంద మండలం కోగిలతోట గ్రామానికి చెందిన కృష్ణాచారి తన సర్వే. నెం. 111/సీ లో 2.19 ఎకరాలు తనకు పెద్దల నుంచి సంక్రమించిదని, విచారణ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్స్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్పీవో నూర్జహాన్, డిఎల్డివో రమణ రెడ్డి, షఫీఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, ఆర్టీసీ డిపోమేనేజర్ మహమ్మద్ రఫ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, డీటీలు గుండాల నాయక్, వలిభాష పాల్గొన్నారు.