Share News

సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రణాళిక

ABN , Publish Date - Feb 18 , 2025 | 12:27 AM

నియోజకవర్గంలోని రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెత్యే జయనాగేశ్వరరెడ్డి తెలి పారు.

సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రణాళిక
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

రైతులకు మార్చి చివరి వరకు సాగునీరు

ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెత్యే జయనాగేశ్వరరెడ్డి తెలి పారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎల్‌ఎల్‌సీ, జీడీపీ, జీఆర్‌పీ, ఇరిగేషన, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలతో సమావేశమై సాగు, తాగు నీటిపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎల్‌ఎల్‌సీ కాలువకు ప్రస్తుతం 520 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, దాన్ని 600 క్యూసెక్కుల నీటి విడుదలకు టీబీపీ బోర్డు అధికారులతో మాట్లాడి నీటి గేజ్‌ పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. టీబీ డ్యాం ద్వార 2.1టీఎంసీల నీటిని రాబడుతున్ననట్లు తెలిపారు. ఎల్‌ఎల్‌సీ కింద మార్చి 30వరకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. ఎల్‌ఎల్‌సీ కింద 6500 ఎకరాలతో పాటు మరో 6000 ఎకరాలకు సాగునీరు అందుతాయని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే నియోజకవర్గంలోని ఎమ్మిగ నూరు పట్టణంతో పాటు గోనెగండ్ల, నందవరం ఎమ్మిగనూరు మండలా ల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా ప్రణాళిక రూపోందించామన్నారు. నియోజకవర్గంలోని 3 మండలాల్లో 80శాతం గ్రామాలకు మే చివరి వరకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వాటర్‌గ్రిడ్‌ కింద పనులు చేపట్టేందుకుగాను 286కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.

కొత్త బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే : ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు మంజూరైన నాలుగు కొత్తబస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం బెంగళూరు పట్టణానికి రెండు బస్సులు, బళ్ళారికి రెండు బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం మద్దిలేటి నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు ఈరన్న గౌడ్‌, నారాయణ రెడ్డి, చిన్న రాముడు, మల్లికార్జున, గురరాజ దేశాయి, చంద్రశేఖరరెడ్డి కడిమెట్ల చెన్నారెడ్డి, శంకర్‌గౌడ్‌, రామకృష్ణ నాయుడు, ముల్లా కరిముల్లా, నజీర్‌, రంగస్వామి, తురేగల్‌ నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:28 AM