Share News

వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:54 AM

అమెరికా దేశం భారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి
నిరసన తెలుపుతున్న ఏపీ రైతు సంఘం నాయకులు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): అమెరికా దేశం భారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఏఐకేఎస్‌ అద్వర్యంలో నగరంలోని సుందరయ్య కూడలి లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స భారత రాక సంద ర్భంగా జేడీ వ్యాన్స గో బ్యాక్‌ అంటూ నిరసనలు తెలిపారు. భారత అమ్మకానికి లేదని..ట్రంప్‌, మోదీ విధానాలు నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాతో అన్ని అసమాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చర్చల నుంచి వైదొల గాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జేడీ వ్యాన్స భారత దేశ పర్యటన బహుళ జాతి కంపెనీలకు భారీ లాభాలు చేకూర్చేందుకేనని అన్నారు. జిల్లా కార్యదర్శి జి.రామక్రిష్ణ, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్‌బాబు, కార్మిక నాయకులు రాముడు, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:54 AM