ఉగ్రవాదుల దాడి అమానుషం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:51 AM
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి అమాను షమని వీహెచ్‌పీ నాయకులు విట్టా రమేష్, ఉపేంద్ర, బసవన్న గౌడ్, నాగరాజు గౌడ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు.
ఆదోని, ఆలూరు, పత్తికొండలో నివాళులు
ఆదోని, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి అమాను షమని వీహెచ్‌పీ నాయకులు విట్టా రమేష్, ఉపేంద్ర, బసవన్న గౌడ్, నాగరాజు గౌడ్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహి ంచారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడు లను ఖండిస్తున్నామని, దాడి అనంతరం భార త్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు.
ఉగ్రవాద దాడులు అమానుషం
తుగ్గలి: పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం అమాను షమని, టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ వల్లె వెంకటేశ్ బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మన్న అన్నారు. శుక్రవారం తుగ్గలిలో కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించారు. ఆకుల శీనప్ప, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దాడి హేయం: వీరభద్ర గౌడ్
ఆలూరు: కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు హేయమని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మెన్ మాజీ గుమ్మనూరు నారాయణ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. పాక్‌పై ప్రతికార చర్య తీసుకునేందుకు భారత్ సైన్యం ఎదురుదాడికి దిగిందన్నారు. మోదీ, అమిత్ షా ఈ కాల్పులపై సీరియస్‌గానే ఉన్నారన్నారు. క మార్కెట్ యార్డ్ చైర్మెన్ మాజీ రామ్‌నాథ్ యాదవ్, ఏబీసీ కెనాల్ డీసీ చైర్మెన్ కిష్టప్ప, సర్పంచ్‌లు నాగరాజు, పురుషోత్తం పాల్గొన్నారు.