శతాబ్ది బ్రహ్మోత్సవాల నిర్వహణ అభినందనీయం
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:00 AM
పాతనగరంలోని పేట శ్రీరామాలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పాతనగరంలోని పేట శ్రీరామాలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. గత ఐదు రోజులుగా ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాతనగరంలో బుధవారం రాత్రి సీతారామచంద్ర, లక్ష్మణ స్వామి ఉత్సవ విగ్రహాలతో భారీ దివ్య మంగళ రథోత్సవం నిర్వహిం చారు. ఈ రథోత్సవాన్ని టీజీ వెంకటేశ పూజలు చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేట రామాలయ అభివృద్ధికి మంత్రి టీజీ భరత తనవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని అన్నారు. కార్యక్రమంలో ఆలయంలో అన్నప్రసాద దాత, కేవీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బరెడ్డి, అఖిల భారత కరివేన నిత్యాన్నదాన సత్రం జిల్లా కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిలుకూరు ప్రభాకర్, లలితాపీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి, వెల్దుర్తి ఆంజనేయ స్వామి, వీహెచపీ నాయ కులు ప్రాణేశ, మాళిగి భానుప్రకాశ, ఈపూరి నాగరాజు పాల్గొన్నారు.
వైభవంగా స్వామివారి కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉద యం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో వివిధ ప్రాం తాలకు చెందిన బ్రాహ్మణ పండితులు, అశేష భక్తులు పాల్గొన్నారు. రాత్రి జరిగిన స్వామివారి దివ్య మంగళ రథోత్సవ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో లలితాపీఠం, గోదా గోకులం, విష్ణు సహస్రనామ పారాయణం బృందం, శ్రీబాలాజీ సేవా ట్రస్టుల తోపాటూ పరిసర గ్రామాలకు చెందిన భజన బృందాలు పాల్గొ న్నాయి. బాలికల కోలాటాలు, మహిళల ఢమరుక నృత్యాలు, యువత నందికోళ్లసేవ, విజ్ఞానపీఠం విద్యార్థుల చెక్కభజనలు ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో దినేష్ చౌదరి, ప్రధాన అర్చకులు మాళిగి హనుమేషాచార్యులు, వేద వ్యాసాచార్యులు, రాఘవేంద్రమూర్తి, విద్యానిధి ఆచార్యలు పాల్గొన్నారు.