Share News

నీరు కావాలంటే బండి కట్టాల్సిందే..!

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:15 AM

మండలంలోని ముద్దనగేరి కురకుంద గ్రామంలో 15రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కావాలంటే బండి కట్టాల్సి వస్తోంది. ట్యాంకులు పెట్టుకుని వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

నీరు కావాలంటే బండి కట్టాల్సిందే..!
ముద్దనగేరి గ్రామంలో ఎద్దుల బండిపై నీరు తెస్తున్న గ్రామస్థులు

ఆలూరు రూరల్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముద్దనగేరి కురకుంద గ్రామంలో 15రోజుల నుంచి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కావాలంటే బండి కట్టాల్సి వస్తోంది. ట్యాంకులు పెట్టుకుని వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విరుపాపురం జలాశయం నుంచి తాగునీరు రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ముద్దనగేరి సర్పంచి సుధాకర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసారులు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:15 AM