Share News

విచారించి న్యాయం చేస్తాం

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:06 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే సమస్యలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు.

విచారించి న్యాయం చేస్తాం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ

ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

నంద్యాల టౌన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే సమస్యలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. సోమవారం బొమ్మలసత్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా మన్నారు. నిర్ణిత గడువులోగా సమస్యలు పునరావృతం కాకుండా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల్లో సివిల్‌ తగాదాలు, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు. ఈ రోజు మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయన్నారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేనివారు స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు ఇవ్వాలని అన్నారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:07 AM