Share News

నందివర్గం సొసైటీలో అవినీతిపై విచారిస్తాం: మంత్రి బీసీ

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:53 PM

నందివర్గం సొసైటీలో గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు లక్షల రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

నందివర్గం సొసైటీలో అవినీతిపై విచారిస్తాం: మంత్రి బీసీ
చేనేతలకు మగ్గాలు, పరికరాలు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): నందివర్గం సొసైటీలో గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు లక్షల రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సొసైటీలో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.నంద్యాల జిల్లాలోని బనగానపల్లెమండలం నందివర్గం గ్రామంలో 75 మంది చేనేత లబ్దిదారులకు రూ.28లక్షల విలువ చేసే చేనేత మగ్గాలు,పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత కుటుంబాలకు రూ.200 యూనిట్లు విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. పవర్‌లూమ్‌ యంత్రాలు ఉపయోగించే చేనేత కుటుంబాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం సీఎం చంద్రబాబునాయడుకే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిశ్రమల శాఖఏడీ జి. నాగరాజారావు ఏడీవో ఈశ్వరయ్య,మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, ఉమామహేశ్వరరావు, లాయర్‌ సుబ్రమణ్యం, బండా సుబ్బారావు, సీతారామయ్య, రాముడుపాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:53 PM