మిరప రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:13 AM
మిరప రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
నందవరం, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మిరప రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని హలహర్వి గ్రామంలో మిరప పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంత వరకు పెట్టుబడి పెట్టారు. ఎంత దిగుబడి వచ్చింది. ఎకరాకు ఎంత మేరకు నష్టం వచ్చిందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్లలో ఏసీ స్టోరెజ్ గోడౌన్లు ఏర్పాటు చేస్తా మన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలు పూర్తిగా సేకరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో స్రవంతి, టీడీపీ నాయకులు రైస్‌మిల్ నారాయణరెడ్డి, వెంకట్రామిరెడ్డి, కన్వీనర్ డీవీ రాముడు, కాశీంవలీ, గోపాల్, జగన్నాథరెడ్డి, దావీదు, నాగరాజు, మణి, బాపురంశ్రీను, వెంకట్రాముడు, ప్రభుదాసు పాల్గొన్నారు.