Share News

మరణంలోనూ వీడని బంధం..

ABN , Publish Date - Apr 20 , 2025 | 12:25 AM

దాదాపు యాభై ఏళ్లు కలసి జీవనం సాగించిన ఆదంపతులు మరణంలోనూ కలిసే ప్రయాణించిన హృదయ విషాదకర సంఘటన ఇది. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని ప్రియదర్శిని హోటల్‌ సీమీపాన 44వ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

మరణంలోనూ వీడని బంధం..
కారును తొలగిస్తున్న పోలీసులు, ఇన్‌సెట్‌లో దంపతులు

రోడ్డుప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

గృహప్రవేశానికి వెళ్లి వస్తూ..

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల వద్ద ఘటన

బండిఆత్మకూరు, ఏప్రిల్‌19 (ఆంధ్రజ్యోతి): దాదాపు యాభై ఏళ్లు కలసి జీవనం సాగించిన ఆదంపతులు మరణంలోనూ కలిసే ప్రయాణించిన హృదయ విషాదకర సంఘటన ఇది. శుక్రవారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోని ప్రియదర్శిని హోటల్‌ సీమీపాన 44వ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నంద్యాల జిల్లా బండిఆత్మ కూరు మండలం కాకనూరుకి చెందిన దేరెడ్డి పుల్లారెడ్డి, ఆయన భార్య లక్ష్మీపుల్లమ్మ, వీరి కుమారుడు సుబ్బారెడ్డి, బంధువులైన బలప నూరుకు చెందిన మహేశ్వరమ్మ, స్రవంతి, మరో నాలుగేళ్ల చిన్నారితో కలిసి గురువారం ఉదయం స్వంత కారులో హైదరాబాద్‌లోని బంధువుల గృహప్రవేశానికి తరలివెళ్లారు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ప్రియదర్శిని హోటల్‌ సమీపాన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుల్లారెడ్డి(70), లక్ష్మీపుల్లమ్మ(67) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయారు. డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న కొడుకు సుబ్బారెడ్డికి స్వల్పగాయా లయ్యాయి. మహేశ్వరమ్మ, స్రవంతికి బలమైన గాయాలు కాగా, నాలుగేళ్ల చిన్నారికి సైతం గాయాలైనట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - Apr 20 , 2025 | 12:25 AM