Share News

ముంచిన గాలివాన

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:39 AM

మూడు రోజుల నుంచి గాలివాన బీభత్సానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరిగోపుల గ్రామానికి చెందిన గుండిచంద్రుడు అనే రైతుకు చెందిన 1.25 ఎకరాల్లో సాగుచేసిన మునగచెట్లన్నీ నెలకొరిగాయి.

ముంచిన గాలివాన
తరిగోపుల గ్రామంలో కూలిన మునగచెట్లు రాలిన మామిడికాయలను చూపుతున్న రైతులు

నేలకొరిగిన మునగ చెట్లు

రాలిపోయిన మామిడికాయలు

ఆందోళనలో అన్నదాతలు

జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల నుంచి గాలివాన బీభత్సానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరిగోపుల గ్రామానికి చెందిన గుండిచంద్రుడు అనే రైతుకు చెందిన 1.25 ఎకరాల్లో సాగుచేసిన మునగచెట్లన్నీ నెలకొరిగాయి. రూ.1లక్ష వరకు పెట్టుబడి పెట్టిన చేతికొచ్చే సమయంలో పడిపోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. అదే గ్రామంలో మంగన్న అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిటితోటలో గాలివానకు మామిడికాయలు రాలిపోయాయని, రూ.1.50 లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తంగడంచ గ్రామంలో ఆరబెట్టిన మొక్కజొన్నగింజలు వానకు తడిసినట్లు రైతులు తెలిపారు. ఆదివారం సాయంత్రం గాలివానకు చెట్లుపడటంతో విద్యుత్‌ సరఫరాకు రెండు గంటల పాటు తీవ్ర అంతరాయం కలిగింది. మండలంలో మొత్తం 44.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Apr 22 , 2025 | 12:39 AM