బీఎస్‌ఎనఎల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:56 PM
బీఎస్‌ఎనఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ జనరల్ మేనేజర్ జి.రమేష్ సూచించారు.
జనరల్ మేనేజర్ రమేష్
కర్నూలు న్యూసిటీ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): బీఎస్‌ఎనఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ జనరల్ మేనేజర్ జి.రమేష్ సూచించారు. బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని సంస్థ ఆధ్వర్యంలో వినూత్న ఆఫర్లు, సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 210 ఓఎల్‌టీఈలతో సుమారు 16,400 భారత ఫైబర్ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే మిషన 20కే నినాదంతో టెలికామ్ ఇనఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 346 మొబైల్ టవర్లలో 303 టవర్లకు 4జీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏ టెలికాం మొబైల్ ఆపరేటర్ అందివ్వని ఏడు ప్రాంతాల్లో కొత్తగా బీఎస్‌ఎనఎల్ 4జీ శాచురేషన ప్రాజెక్టు ఏర్పాటు చేసిందన్నారు. వినియోగదారులు పాత సిమ్‌కార్డులను 4జీ సిమ్‌లోకి అప్‌గ్రేడ్ చేసుకోవాలని జీఎం సూచించారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజేశ్వరరావు, ఐఎఫ్‌ఏడీ శ్రీలత, ఏజీఎం (ఆపరేషన) శ్రీనివాసరావు, ఏజీఎం (అడ్మిన) వి.శ్రీనునాయక్, డోన ఏజీఎం జి.నారాయణస్వామి, ఏజీఎం (మొబైల్ ఇనచార్జి) చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.