తిరుపతి జిల్లా పెన్నేపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:12 AM
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఋదవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్ధంతో బాయిలర్ పేలిపోయింది.
ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
పూర్తి వివరాలు తెలియక అయోమయం
పెళ్లకూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఋదవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద శబ్ధంతో బాయిలర్ పేలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, స్టీల్‌ప్లాంట్‌లో రాత్రి షిఫ్టులో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంతా బీహార్‌వాసులేనని స్థానికులు చెబుతున్నారు. యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది.