Share News

Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:26 AM

వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్‌ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

 Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

  • గృహ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్తు

  • ఆర్‌డీఎ్‌సఎస్‌ పనులు వేగవంతం చేయండి

  • డిస్కమ్‌లకు మంత్రి గొట్టిపాటి ఆదేశం

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ‘వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్‌ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ డిస్కమ్‌లను ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కలసి డిస్కమ్‌ల సీఎండీలు పృధ్వీతేజ్‌, భాస్కర్‌, సంతోశ్‌రావులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘వేసవిలో విద్యుత్తు కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ సిస్టమ్‌ (ఆర్‌డీఎ్‌సఎస్‌) పనులను వేగవంతం చేయాలి. వేసవి సమయంలో పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై దృష్టి సారించాలి. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.

Updated Date - Mar 04 , 2025 | 06:26 AM