Share News

Minister Gotti Pati : బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 10 , 2025 | 05:21 AM

బడుగుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. సమాజంలోని అసమానతలు

Minister Gotti Pati : బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యం

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): బడుగుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. సమాజంలోని అసమానతలు తొలగించేందుకు కృషిచేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్తు సంస్థ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం 2025 డైరీని ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ వేస్తామని ప్రకటించారు.

Updated Date - Jan 10 , 2025 | 05:21 AM