Minister Lokesh : శవం దగ్గర పుట్టిన పార్టీ వైసీపీ
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:24 AM
చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను మంత్రి లోకేశ్ ఖండించారు.

మరో శవంతో అధికారంలోకి వచ్చింది
జగన్‌ను జనం ఛీకొట్టినా హత్యా రాజకీయాలు మానడం లేదు
టీడీపీ కార్యకర్త హత్యపై నారా లోకేశ్ ఆగ్రహం
రామకృష్ణ హత్యను ఖండించిన పల్లా శ్రీనివాసరావు
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను మంత్రి లోకేశ్ ఖండించారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘వైసీపీ రాక్షస మూకల దాడిలో గాయపడి మృతిచెందిన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కొడుకు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను. ఒక శవం దగ్గర పుట్టి, మరో మృతదేహంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, జగన్మోహన్ రెడ్డిని జనం ఛీకొట్టారు. అయినా హత్యా రాజకీయాలు మానడం లేదు.
నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తాం వైసీపీ రక్త చరిత్రకు టీడీపీ సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరం.వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం’ అని లోకేశ్ పేర్కొన్నారు. రామకృష్ణ హత్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదన్నారు.