Minister Nadendla Manohar : చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:19 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో
త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్: మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను కొత్త పుంతలు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా నిరూపించారని తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎ్‌సను మంత్రి మనోహర్ సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.దినే్‌షకుమార్ ఆ వ్యవస్థ పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ వ్యవస్థను చూశాక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలమన్న నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించుకుని పంచాయతీలు, పురపాలక సంఘాలలో ప్రజలకు సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో సమర్థంగా అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు.