Share News

Fuel charges : ఇంధన చార్జీలను ప్రభుత్వమే భరించాలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:41 AM

విద్యుత్‌ బిల్లుల్లో ప్రతి నెలా విధిస్తున్న ఇంధన చార్జీలను ప్రభుత్వమే భరించాలని విద్యుత్‌ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్‌ ఎంవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఏపీఈఆర్సీ

 Fuel charges : ఇంధన చార్జీలను ప్రభుత్వమే భరించాలి

విజయవాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బిల్లుల్లో ప్రతి నెలా విధిస్తున్న ఇంధన చార్జీలను ప్రభుత్వమే భరించాలని విద్యుత్‌ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్‌ ఎంవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఏపీఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన బుధవారం మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు వినియోగదారులు చెల్లింపులు చేయాల్సి రావడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. తిరుపతి నుంచి గురుస్వామి నాయుడు మాట్లాడుతూ కనీసం 100 యూనిట్ల వరకు ఒక స్లాబ్‌ ఉండేలా మార్పు చేయాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి పీవీఎస్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యుత్‌ సబ్సిడీని అన్ని చేపల చెరువులకు అమలు చేయాలని కోరారు. అలాగే, వినియోగదారుల సేవల కోసం ఏర్పడ్డ ఏపీఈఆర్‌సీ తమ పక్షాన నిర్ణయాలు తీసుకుంటోందన్న విశ్వాసం ప్రజల్లో లేదని, తక్షణమే సెకీ పీపీఏలను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. వినియోగదారులందరిపైనా భారం పడేలా స్మార్ట్‌మీటర్లను బిగించడం సరికాదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న ఇంధన సర్దుబాటు భారాన్ని రద్దు చేయాలన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 04:41 AM