న్యాక్ బృందం పర్యటన
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:49 AM
స్థానిక కెహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం న్యాక్ బృందం పర్యటించింది.
ధర్మవరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): స్థానిక కెహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం న్యాక్ బృందం పర్యటించింది. నేషనల్ అండ్ అక్రిడిటేషన కౌన్సిల్ బృందం చైర్‌పర్సన సదాశివభట్, కో-ఆర్డినేటర్ అనిల్‌ఓజా, సభ్యులు బాబన తైవాడే ఆ బృందంలో ఉన్నారు. ఐదేళ్లలో కళాశాల అభివృద్ధిని, విద్యా కార్యకలాపాలను న్యాక్ సభ్యులకు ప్రిన్సిపల్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. న్యాక్ ప్రమాణాలతో కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, బోధన, పరిశోఽ దన తదితర అంశాలను వివరించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించి.. వారి అనుభవాలను బృంద సభ్యులకు వివరించేలా చేశారు. కార్యక్రమంలో ఐక్యుయేసి కో-ఆర్డినేటర్ కిరణ్‌కుమార్, న్యాక్ కో ఆర్డినేటర్ పావని, అధ్యాపకులు పాల్గొన్నారు.