Share News

8న విశాఖకు ప్రధాని మోదీ రాక

ABN , Publish Date - Jan 02 , 2025 | 02:22 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఆయన నగరంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

8న విశాఖకు ప్రధాని మోదీ రాక

విశాఖపట్నం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఆయన నగరంలో ఉంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ నిర్మించనున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంటుకు శంకుస్థాపన, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను సభా వేదిక నుంచి చేపడతారు. ఈ నెల 4న నిర్వహించనున్న నేవీడే పరేడ్‌కు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అదేరోజు రాత్రి తిరిగి విజయవాడ వెళ్లిపోతారని అధికార వర్గాలు తెలిపాయి. మళ్లీ 8న ప్రధానితోపాటు ఏయూలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కాగా, మంత్రి నారా లోకేశ్‌ 7న విశాఖకు రానున్నారు. శతశాతం టీడీపీ సభ్యత్వం తీసుకున్న భీమిలి మండలం ముచ్చర్ల గ్రామాన్ని ఆయన సందర్శిస్తారు.

Updated Date - Jan 02 , 2025 | 02:22 AM