land dispute : ఎన్నిసార్లు ఫిర్యాదిచ్చినా పట్టించుకోవట్లేదు
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:17 AM
‘మా స్థలాన్ని మరొకరు కబ్జా చేశారు.. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ప్రకాశం జిల్లా శంకవరానికి చెందిన జి.ధనలక్ష్మి అనే మహిళ టీడీపీ గ్రీవెన్స్‌లో వాపోయారు.
స్థలం కబ్జాపై టీడీపీ గ్రీవెన్స్‌లో వాపోయిన మహిళ
అమరావతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘మా స్థలాన్ని మరొకరు కబ్జా చేశారు.. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ప్రకాశం జిల్లా శంకవరానికి చెందిన జి.ధనలక్ష్మి అనే మహిళ టీడీపీ గ్రీవెన్స్‌లో వాపోయారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ అనురాధ, మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ గ్రీష్మ వినతులు స్వీకరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు జి.అప్పారావు తప్పుడు పత్రాలతో తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని కృష్ణా జిల్లా మల్లవల్లికి చెందిన బి.సాంబశివరావు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా యర్రగుంట్లలో గతంలో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు మంజూరు చేయగా, వైసీపీ ప్రభుత్వంలో అర్హుల జాబితా నుంచి తమ పేర్లు తొలగించారని ఎం.చక్రవర్తి వాపోయారు.