Share News

పేలుడు పదార్థాల కేసులో చురుగ్గా దర్యాప్తు

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:25 PM

నిషేధ పేలుడు పదార్థాల వ్యాపారం కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోతోంది. మండలంలోని నాగరాజుపల్లికి చెందిన వైసీపీ నేత దాసం హనుమంతరావును ఆదివారం అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

పేలుడు పదార్థాల కేసులో చురుగ్గా దర్యాప్తు

మార్టూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) : నిషేధ పేలుడు పదార్థాల వ్యాపారం కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోతోంది. మండలంలోని నాగరాజుపల్లికి చెందిన వైసీపీ నేత దాసం హనుమంతరావును ఆదివారం అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రెండు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లగా, వారిలో ఒక పోలీసు బృందం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా నిఘాతో కేసులో పురోగతిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాకుండా నాగరాజుపల్లి సమీపంలోని గొడౌన్‌లో ఉన్న అక్రమ పేలుడు పదార్థాల నిల్వలు, వాటి బిల్లులు, రశీదులు విషయంలో పలు వ్యత్యాసాలు ఉండడంతో ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదనపు సమాచారం మరింత విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు, ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇంకెవరైనా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారా.. పేలుడు పదార్థాలను స్వార్థానికి వినియోగిస్తున్నారా అనే అంశంపై లోతైన విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండుమూడు రోజుల్లో పూర్తిసమాచారం సేకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated Date - Apr 21 , 2025 | 11:25 PM