బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు.
తాళ్లూరు మండలంలోని కొత్తపాలెంలో ఓ యువకుడు రాత్రి సమయంలో డాబా దిగుతూ జారిపడి మృతి చెందిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది.
అకాల వర్షాలు రైతులు ఉసురుతీస్తున్నాయి. ఆరుగాలం కష్టించి లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంటలు చేతి కందే సమయంలో ప్రకృతి ఆగ్రహానికి గురై నీటి పాలవుతున్నాయి.
ఎన్నికల నాటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్న గ్రానైట్ పరిశ్రమను గాడిన పడేలా చేసేందుకు నూతన మైనింగ్ పాలసీని రూపొందించింది. మంగళవారం దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్యాకేజీ 2, ప్యాకేజీ-4లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.106.39 కోట్లను మంజూరు చేసింది. అత్యవసరాన్ని బట్టి తొలుత టెండర్ పొందినవి కాకుండా ఇతర ఏజెన్సీలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆమేరకు ఆమోదం తెలుపుతూ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది.
మార్కాపురం ప్రాంతంలో భూమాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ, అసైన్డ్ భూములు, వాగులు, వంకల ఆక్రమణలను తెగబడిన అక్రమార్కులు.. ఇప్పుడు రిజిస్టర్డ్ పట్టా భూములను కూడా వదలడం లేదు. చివరికి తహసీల్దార్, వీఆర్వోల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టా భూములకు నివేశన స్థల ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. వాటిని పల్నాడు జిల్లా వినుకొండలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు.
జిల్లా సహకార శాఖ ఇన్చార్జి అఽధికారిగా ఎన్.ఇందిరాదేవి నియమితులయ్యారు. సహకారశాఖ డివిజనల్ అధికారి హోదాలో ఉన్న ఆమె ప్రస్తుతం పీడీసీసీ బ్యాంకు లీగల్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రక్షాళనకు డీఈవో కిరణ్కుమార్ శ్రీకారం చుట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పనిభారం తగ్గించి ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా పలువురికి స్థానచలనం కల్పించారు.
ప్రజలు అప్రమత్తతతో ఉంటే అగ్ని ప్రమాదాలు నివా రించవచ్చని మార్కాపురం అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ అన్నారు.
ఎట్టకేలకు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా మంగళవారం ముగిశాయి. ఎన్నికల అధికారిగా రవి కుమార్రెడ్డి వ్యవహరించగా ఉదయం నుంచి జరిగిన ఎన్నికల్లో మొత్తం 201 ఓట్లకు గాను 190 పోలయ్యాయి.