Share News

బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి పూజలకు అన్ని ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 30 , 2025 | 10:23 PM

మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీ దివాకరపల్లి గ్రామ సమీపంలో ఏప్రిల్‌ 2న జరగనున్న రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుసంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. భూమిపూజ అనంతరం బహిరంగసభ నిర్వహిస్తుండడంతో అందుకు అవసరమైన సభా వేదికను ఏర్పాటుచేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భూమిపూజ జరిగే ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు.

బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి  పూజలకు అన్ని ఏర్పాట్లు
అధికారులు, రిలయన్స్‌ ప్రతినిధులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

చకచకా సాగుతున్న పనులు

పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

పీసీపల్లి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీ దివాకరపల్లి గ్రామ సమీపంలో ఏప్రిల్‌ 2న జరగనున్న రిలయన్స్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుసంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. భూమిపూజ అనంతరం బహిరంగసభ నిర్వహిస్తుండడంతో అందుకు అవసరమైన సభా వేదికను ఏర్పాటుచేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భూమిపూజ జరిగే ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపూజ నాడు జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. సభావేదికను పరిశీలించిన ఆయన వీఐపీలు, ప్రజలు, మీడియా తదితరుల కోసం ఏర్పాటు చేస్తున్న గ్యాలరీలను సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. వీఐపీల వాహనాలు పార్కింగ్‌ చేసే స్థలంతో పాటు హెలిప్యాడ్‌ల వద్ద బారికేడ్లను ఏర్పాటుచేయాలని సీఐ ఖాజావలిని ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజల వాహనాలకు సభాస్థలికి దక్షిణం వైపున పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య, బత్తిన రాధాక్రిష్ణ, రిలయన్స్‌ ప్రతినిధి ఫణీందర్‌, గడ్డం బాలసుబ్బయ్య, నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి, యారవ శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్లా నరసింహారావు, క్రిష్ణారెడ్డి, కుందూరి తిరుపతిరెడ్డి, తాటికొండ వెంకటేశ్వర్లు, యడవల్లి శ్రీనివారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 10:23 PM