Share News

చీమకుర్తిలో విద్యుత్‌ సమస్యలకు చెక్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:40 AM

చీమకు ర్తి మండలవాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విద్యుత్‌పరమైన అంశం సాకారమ యింది.

 చీమకుర్తిలో విద్యుత్‌ సమస్యలకు చెక్‌

వినియోగంలోకి డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌

ప్రారంభించిన ఈఈ హరిబాబు

వేసవిలో మండలవాసులకు తప్పనున్న కరెంట్‌ కష్టాలు

చీమకుర్తి, ఏప్రిల్‌24(ఆంధ్రజ్యోతి) : చీమకు ర్తి మండలవాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విద్యుత్‌పరమైన అంశం సాకారమ యింది. నిరంతర విద్యుత్‌ను వినియోగదారు లకు అందించే నిమిత్తం అవసరమైన 33కేవీ డబుల్‌ సర్క్యూట్‌లైన్‌ను ఉప్పలపాడు నుంచి చీమకుర్తి వరకూ దాదాపు రూ.1.50కోట్లతో ఏ ర్పాటు చేశారు. గురువారం రాత్రి ఈఈ మా కినేని హరిబాబు డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ను చార్జ్‌ చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. దీంతో మండలపరిధిలోని వినియోగదారులకు వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు వీ లుకలుగుతుంది. దీనికి సంబధించిన పనులు గత నాలుగునెలలుగా జరుగుతుండటంతో ప ల్లామల్లి, నాయుడుపాలెం తదితర సబ్‌స్టేషన్‌ పరిధిలోని రైతులకు పగలు తొమ్మిది గంటల పాటు త్రీ ఫేస్‌ విద్యుత్‌ను సరఫరా చేయటం లో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రాత్రివేళ విద్యుత్‌ సరఫరాతో రైతులు సైతం ఇక్కట్లుకు గురయ్యారు. ఇక ఇపుడు ఈ కష్టాలకు చెక్‌ పడ్డట్లయింది. పగలు తొమ్మిది గంటలపాటు త్రీ ఫేస్‌ విద్యుత్‌ని సరఫరా చేయవచ్చు. కా ర్యక్రమంలో డీఏఈలు మోహనరావు, సత్యనా రాయణ, ఏఈలు టి.చంద్రశేఖర్‌రావు, శ్రీనివా సరావు, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:40 AM