పరిశుభ్రతకు తోడ్పాటును అందించండి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:50 PM
మన ప్రాంతాల పరిశుభ్రతపై దృష్టి సారించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రామాపురంలో నిర్వహించే అవగాహన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కొండయ్య సమీక్ష
21న మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో మీకోసం
చీరాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : మన ప్రాంతాల పరిశుభ్రతపై దృష్టి సారించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రామాపురంలో నిర్వహించే అవగాహన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం నిర్వహించనున్న శానిటేషన్ కార్యక్రమం రేపు శనివారం రామాపురం తీరంలో జరుగనుంది. అందుకు సంబంధించి ఎమ్మెల్యే కొండయ్య ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అఽధికారులు, ప్రజలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగే ప్రజా ఫిర్యాదుల వేదిక మీకోసం కార్యక్రమం ఈనెల 21న చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ పాల్గొననున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎండీ మొయిన్, తహసీల్దార్‌లు గోపీకృష్ణ, పార్వతి, డీఎల్‌పీవో శివన్నారాయణ, అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.