Share News

అద్దంకిలో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:46 PM

అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.6.5కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కొన్ని పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్‌లు పూర్తయి ప్రారంభించగా, మిగిలిన వాటికి టెండర్‌లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.

అద్దంకిలో అభివృద్ధి పనులు

రూ.1.5కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం

అద్దంకి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.6.5కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కొన్ని పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్‌లు పూర్తయి ప్రారంభించగా, మిగిలిన వాటికి టెండర్‌లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి సు మారు రూ.1.5కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైన్‌ లు టెండర్‌లు పూర్తయి పనులు ప్రారంభమయ్యా యి. బీఆర్‌ఎస్‌ అండ్‌ యస్‌ఎల్‌ఆర్‌యస్‌ పథకం ద్వారా సుమారు రూ.3కోట్ల నిధులు మంజూరు కాగా సీసీ రోడ్డు, సైడ్‌ డ్రైన్‌లు, పార్కుల అభివృద్ధి చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా పనులు గుర్తించి ప్రతిపాదనలు పంపారు. టెండర్‌లు పిలిచేందుకు సిద్ధం చేస్తున్నారు. జనరల్‌ ఫండ్‌ నుంచి సుమారు కోటి రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైన్‌ ల నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో పట్టణంలోని ఆయా ప్రాంతాలలో రోడ్లు, సైడ్‌ డ్రైన్‌ల సమస్య తీరనుంది. పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 11:46 PM