నిరుపయోగంగా వ్యవసాయ మార్కెట్‌యార్డు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:20 AM
ప్రభుత్వం రెండు మండలాల రైతుల ప్రయోజనం కోసం నిర్మిం చిన వ్యవసాయ మార్కెట్‌యార్డు వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరింది.
పెద్దదోర్నాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రెండు మండలాల రైతుల ప్రయోజనం కోసం నిర్మిం చిన వ్యవసాయ మార్కెట్‌యార్డు వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరింది. లక్షల రూపాయలు విలువైన స్థలాన్ని సేకరించడమే కాకుండా భవనాలు నిర్మించింది. కాని వినియోగంలోకి తీసుకురాక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, ప్రజాధనం వృథా అయ్యింది.
కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కనే విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రైతులకు అందుబాటు లో 16 ఎకరాలలో వ్యవసాయ మార్కెట్ నిర్వహణ కోసం 3 దశాబ్ధాల క్రితం షెడ్డు, శీతల గిడ్డంగులు కోసం 2 భవనాలు, కార్యాలయం నిర్మించింది. వీటి నిర్వహణను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో భాగం చేశారు. పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఉద్యోగిని కూడా నియమించారు. మండలం నుండి బయట ప్రాంతాలకు తరలివెళ్లే ధాన్యం, పంటలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే యార్డు ఆలనాపాలనా కరు వైంది. ఇంతవరకు సంబంధిత అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుక్ను పాపాన పోలేదు. దీంతో భవనాలు శిధిలావస్థకు చేరాయి. ఆవరణంతా చిల్ల కంపతో అల్లుకుపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రహరీ గోడలు కూలిపోతున్నాయి. ఇనుప గేట్లు తుక్కుపట్టి పోతున్నాయి. దీంతో ఈ ప్రాంతం అసాం ఘిక కార్యకలాపాలకు ఆవాసంగా మారింది. అప్పుడ ప్పుడు కొందరు కొంత స్థలాన్ని బాగు చేసుకుని క్రీడా పోటీల నిర్వహణ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ఇప్పటికే కొంత భాగాన్ని ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయం, వైద్య ఉప కేంద్రం, రైతుభరోసా కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన స్థలం మాత్రం నిరుపయోగంగానే ఉంది.
రైతులకు వినియోగించాలి
రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డును ఇప్పటికైనా వినియోగంలోకి తీసుకురావాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మండలంలో ప్రధానంగా మిర్చి, పత్తి, ఆముుదం, కందులు, అలసందలు, మినుములు, శనగలు పండి స్తుంటారు. గిట్టుబాటు ధర లేక గుంటూరు, ఆదోని, చెన్నై వంటి ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వ్యయప్రయాసలు అధికమయి పలు ఇక్కట్లకు గురవుతున్నారు. స్థానికంగా శీతల గిడ్డంగు లు ఉన్నట్లయితే పంటను ఇక్కడే నిల్వ చేసుకుని ఆ పంటపై రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ కూడా ఇక్కడే నిర్వహిస్తే రవాణా ఖర్చు కలిసి వస్తుందన్నారు. నూతనంగాఏర్పాటయ్యే మార్కెట్టు యార్డు కమిటి సభ్యులు యార్డు నిర్వహణపై దృష్టి పెట్టాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.