కనిగిరి అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:01 AM
టీడీపీ ప్రభుత్వం హయాంలో కనిగిరిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. శనివారం టీడీపీ 43వ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా స్థానిక కా ర్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని అన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి యువ నాయకు డు నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించా రన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
పామూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం హయాంలో కనిగిరిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసిం హారెడ్డి అన్నారు. శనివారం టీడీపీ 43వ ఆవిర్భావదినోత్సవ సందర్భంగా స్థానిక కా ర్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని అన్నారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి యువ నాయకు డు నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించా రన్నారు. మన ప్రాంతానికి రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌ను మంజూరు చేయించారని, అందుకు మనం దరం రుణపడి ఉండాలన్నారు. వలసలు నివారించాడా నికి మన ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్యిదిద్దేం దుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. ట్రిపుల్‌ఐటీ, నిమ్జ్ లాంటి ప్రాజెక్టులు సకాలంలో వస్తే ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నివారించవచ్చు నన్నారు. ఏప్రిల్ 2న జరగనున్న బయోగ్యాస్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, యారవ శ్రీనివాసులు, బొల్లా నరసింహా రావు, అడుసుమల్లి ప్రభాకర్‌చౌదరి, చుంచు కొండయ్య, సయ్యద్ అమీర్‌బాబు, షేక్ ఖాజారహంతలా,్ల డీవీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఎస్‌పురం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ ఉగ్ర జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్య కర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీసీపల్లి మండలం దివాకరంపల్లె గ్రామంలో బుధవారం జరిగే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమిపూజ కార్యక్రమా నికి కార్యకర్తలు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బి.వెంగయ్య, ఎన్‌సీ మాల కొండయ్య, రజ్జబ్ బాషా, పాములపాటి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
బయోగ్యాస్ ప్లాంట్‌తో యువతకు ఉపాధి
వెలిగండ్ల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌తో యువతకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర అన్నారు. శనివారం వెలిగండ్లలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 2న జరిగే బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో మండలంలోని నాయకులు, కా ర్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, ఇంద్ర భూపాల్ రెడ్డి, గొనా ప్రతాప్, గవదకట్ల హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండ లంలోని 21 గ్రామ పంచాయతీల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎన్టీఆర్‌కు నివాళి
పీసీపల్లి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ బుధవారం జరిగే రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆరోజు ఉదయం 8గంటలకల్లా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామ య్య, గడ్డం బాలసుబ్బయ్య, కరణం తిరుపతయ్య, పల్లా మల్లికార్జున్, ముప్పూరి మాల్యాద్రి, సానికొమ్ము విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.