ప్రజలపై యుద్ధం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:38 AM
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై యు ద్ధం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని విరసం సీనియర్ నేత జి.కల్యాణ్‌రావు పేర్కొన్నారు.
విరసం నేత కల్యాణరావు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 17 (ఆంఽధ్రజ్యో తి) : ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై యు ద్ధం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని విరసం సీనియర్ నేత జి.కల్యాణ్‌రావు పేర్కొన్నారు. ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని మల్ల య్యలింగంభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా కన్వీనర్ వీరాంజనేయులు అధ్యక్షతన జ రిగింది. ఈ సందర్భంగా కల్యాణ్‌రావు మా ట్లాడుతూ చత్తీస్‌ఘడ్ దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై దాడులు ని లిపివేసి మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. 77 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఆదివాసీలకు క నీస సౌకర్యాలైన విద్య, వైద్యం, గృహ నిర్మా ణం, ఉపాధి అవకాశాలు కల్పించని దుస్థితి నె లకొందని చెప్పారు. అటవీ చట్టాలను ఉల్లం ఘించడం, విస్తారమైన రోడ్ల నిర్మాణాలు చే స్తూ అడువుల్లో ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు తరలించుకోవడానికి విధ్వంసం చేస్తున్నారన్నారు. అందువల్లనే ఆదివాసీలు త మ ప్రాణాలను తెగించి పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, పలు సంఘాల నా యకులు చావలి సుధాకర్, చుండూరి రంగా రావు, కృష్ణ, కోటి, వై.వెంకటేశ్వరరావు, ఎంకే. బేగ్, కె.రాజారావు, వెంకటరెడ్డి, కారుమంచి విజయకుమార్, గోపిశ్రీనివాసులు, అబ్దుల్‌స త్తార్, పి.ఖాజావలి, అహ్మద్, నరసింహారావు, మల్లికార్జున, లింగయ్య, బి.రఘురాం తదితరు లు పాల్గొన్నారు.