పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని..
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:28 PM
అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఒక్కరోజు పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చినందుకు మరింత అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యను అత్యంత దారుణంగా గొంతుమీద కాలుపెట్టి నులిమి హత్యచేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో జరిగింది. వివరాలలోకి వెళితే పేర్నమిట్ట చెందిన దారా నవీన్ టంగుటూరు మండలం జమ్ములపాలెంనకు చెందిన శ్రావణిని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
భార్యను వేధిస్తూ..వెంబడించి దాడి
అర్ధరాత్రి గొంతుమీద
కాలుపెట్టి నులిమి హత్య
పేర్నమిట్టలో ఓ మృగాడి దారుణం
ఒంగోలు క్రైం,ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఒక్కరోజు పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చినందుకు మరింత అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యను అత్యంత దారుణంగా గొంతుమీద కాలుపెట్టి నులిమి హత్యచేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలో జరిగింది. వివరాలలోకి వెళితే పేర్నమిట్ట చెందిన దారా నవీన్ టంగుటూరు మండలం జమ్ములపాలెంనకు చెందిన శ్రావణిని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 10 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడు ఉన్నారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నవీన్ పెళ్లి అయిన దగ్గర నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు.
గుడ్‌ఫ్రైౖడే సందర్భంగా శ్రావణి పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అయితే అదే రోజు ఇంటికి తిరిగి రమ్మని నవీన్ ఆదేశించాడు. కానీ శ్రావణి మరుసటి రోజు పేర్నమిట్టకు వచ్చింది. దీంతో కోపోద్రికుడైన భర్త నవీన్ శనివారం రాత్రి నుంచి హింసించడం ప్రారంభించాడు. ఆమెను పలు రకాలుగా ప్రశ్నిస్తూ.. వేధిస్తూ వెంబడించి దాడిచేశాడు. అర్ధరాత్రి దాటిన తరువాత శ్రావణి గొంతు పైన కాలు పెట్టి తొక్కాడు. ఆ సమయంలో ఆమె చెవుల నుంచి రక్తం కారింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను చుట్టుపక్కల వారు 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి శ్రావణి మృతి చెందిందని నిర్ధారించారు. ఈ మేరకు మృతురాలు తల్లి కె.భాగ్యమ్మ ఒంగోలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రావణి మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. శ్రావణి భర్త నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.