బెట్టింగ్‌తో అప్పుల పాలయిన భర్త.. భార్య బలవన్మరణం
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:12 PM
మూడేళ్ల పాప, మూడు నెలల బాబు. ఎంతో అన్యూన్యమైన కు టుంబంలో బెట్టింగ్ యాప్ విషాదాన్ని నింపింది.
వివాదాల్లో కూరుకుపోయిన కుటుంబం
ఈపూరుపాలెం (చీరాల), ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : మూడేళ్ల పాప, మూడు నెలల బాబు. ఎంతో అన్యూన్యమైన కు టుంబంలో బెట్టింగ్ యాప్ విషాదాన్ని నింపింది. ఈపూరుపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరుపా లెం పీర్ల చావిడి సమీపానికి చెందిన మొగల్ బాజీ లియాస్ బబ్లు. చినగంజాంకు చెందిన సుమియా భాను(21) దంపతులు.వీరికి మూడేళ్ల పాప, మూడు నెలల బాబు సంతానం. బాజీ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ బెట్టింగ్ యాప్‌కు బానిసగా మారాడు. ఈనేపథ్యంలో అప్పుల్లో కూరుకుపోవడంతో అనుకోని రీతిలో ఉ న్న ఇంటిని అమ్మకం చేసి బాకీలు తేర్చే ప్రయత్నం జరిగింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. అవికాస్త తారస్థాయికి చేరడంతో ఆదివారంరాత్రి ఇంట్లో ఉరికి పాల్పడింది. వెంటనే భర్త స్థానికుల సహకారంతో చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ట్రైనీ డీఎస్పీ అభిషేక్, సీఐ శేషగిరిరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమియాభాను తల్లి పఠాన్ ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.