మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:57 AM
బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు
అదే వారికి మనమిచ్చే నిజమైన నివాళి
సీఎం సహకారంతో పెద్దఎత్తున రుణ మేళాలు
రాష్ట్ర అభివృద్ధికి అన్నివిధాలుగా కేంద్రం సహకారం
గత వైసీపీ ప్రభుత్వం ఒక్క రుణం ఇవ్వని దుస్థితి
వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రుణమేళా, యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి, కలెక్టర్ అన్సారియా, శాసనసభ్యుడు జనార్దన్, టూరిజం చైర్మన్ బాలాజీ, మేయర్ సుజాతతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ బీసీ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యుడు జనార్దన్ మాట్లాడుతూ సమాజాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసానికి విద్య అవసరాన్ని పూలే ఆనాడే గుర్తించారన్నారు. అనంతరం స్వయం ఉపాధి కోసం 671 మందికి రూ.16.77 కోట్ల విలువైన రుణాల మెగా చెక్కును అందజేశారు. లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలతోపాటు వారి జీవనోపాధికి అవసరమైన ట్యాక్టర్లు, కుట్టుమిషన్లు, ఇతర యూనిట్లు పొందిన లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎల్‌డీఎం రమేష్, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులు సత్యకుమార్, స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాతలు స్థానిక కొత్తమార్కెట్ సెంటర్‌లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో చిన ఒబులేషు, వివిధ శాఖల అధికారులు అంజల, లక్ష్మానాయక్, వరలక్ష్మి, అర్చన, ధనలక్ష్మి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.