సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజాదర్బార్
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:48 PM
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో బుధవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. దర్శి టౌన్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించారు.

దర్శి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో బుధవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. దర్శి టౌన్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల ఇబ్బందుల గూర్చి పట్టించుకోక పోవటంతో సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సారథ్యంలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకే్‌షను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాదర్భార్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుంచి 126 అర్జీలు దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, దర్శి డీఎస్పీ బి. లక్ష్మీనారాయణ, తహసీల్దార్ ఎం. శ్రావణ్‌కుమార్, నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై.మహేశ్వరరావు, ఎంపీడీవో ఎల్. కృష్ణమూర్తి, ఈవోఆర్డీ ఆవుల సుధాకర్, విద్యుత్‌శాఖ ఈఈ పి. శ్రీనివాసులు, ఏడీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.