అవిశ్వాసానికి సిద్ధం
ABN , Publish Date - Apr 23 , 2025 | 11:45 PM
చీరాల మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై ఎట్టకేలకు ఎమ్మెల్యే కొండయ్య వర్గం అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ వెంకటమురళికి అందజేసింది. ఈ విషయం ముందు నుంచే ఆంధ్రజ్యోతి చెప్తునూ ఉంది. అయితే రెండు మాసాలుగా నలుగుతున్న ఈ అంశానికి బుధవారంతో తెరపడింది. పలుమార్లు బల నిరూపణ విషయంలో ఎమ్మెల్యే కొండయ్య ఏమాత్రం తొణక కుండా, జాగ్రత్తగా అడుగులు వేశారు.
ఎట్టకేలకు కలెక్టర్‌కు తీర్మానం అందజేత
చక్రం తిప్పిన ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : చీరాల మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై ఎట్టకేలకు ఎమ్మెల్యే కొండయ్య వర్గం అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ వెంకటమురళికి అందజేసింది. ఈ విషయం ముందు నుంచే ఆంధ్రజ్యోతి చెప్తునూ ఉంది. అయితే రెండు మాసాలుగా నలుగుతున్న ఈ అంశానికి బుధవారంతో తెరపడింది. పలుమార్లు బల నిరూపణ విషయంలో ఎమ్మెల్యే కొండయ్య ఏమాత్రం తొణక కుండా, జాగ్రత్తగా అడుగులు వేశారు. ఈక్రమంలో మునిసిపాలిటీపై తనదైన శైలిలో పట్టు సాధించారు. ప్రత్యర్థుల ప్రయత్నాలను తిప్పికొడుతూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టర్ వారిని బలంతపు ప్రయోగాలపై సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే అవిశ్వాసానికి వెళ్లిన కౌన్సిలర్లు సానుకూలంగా స్పందిచడంతో తదుపరి ప్రక్రియకు ఆర్డీవో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే మ్యాజిక్ ఫిగర్ ఛేదించిన అనంతరం వారిని ఎమ్మెల్యే ఆస్థానంలోకి మరల్చినట్లు సమాచారం.