Share News

ఉగ్ర దాడిపై వెల్లువెత్తిన నిరసనలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:03 PM

కశ్మీర్‌ పహల్గాంలో మతోన్మాదుల మారణకాండకు నిరసనగా కంభం పట్టణంలో శనివారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, హిందూ థార్మిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈర్యాలీలో పాల్గొన్నాయి. నిరసనకారులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ఉగ్ర దాడిపై వెల్లువెత్తిన నిరసనలు
కంభంలో మానవహారంగా నిలబడిన దృశ్యం

కొవ్వొత్తులతో ర్యాలీ, మానవహారం

కంభం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌ పహల్గాంలో మతోన్మాదుల మారణకాండకు నిరసనగా కంభం పట్టణంలో శనివారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, హిందూ థార్మిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈర్యాలీలో పాల్గొన్నాయి. నిరసనకారులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ కంభం పట్టణంలోని గచ్చకాలువ నుంచి మొదలై చౌక్‌సెంటర్‌, జడ్‌జీ బాలికల పాఠశాల, కాలేజీ రోడ్డు మీదుగా కందులాపురం కూడలికి చేరుకుంది. అక్కడ మానవహారం నిర్వహించారు. అసువులుబాసిన 26 మందికి సంతాప సూచకంగా కొవ్వొత్తులు వెలిగించి మౌనంపాటించారు. ఈర్యాలీలో పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ, ఆర్యవైశ్య సంఘం, లయన్స్‌ క్లబ్‌, మాజీ సైనిక ఉద్యోగులు, విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : భారతదేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై విచాక్షణారహితంగా కా ల్పులు జరపడం అమానుషమని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ అన్నారు. ఉగ్రవాదుల దాడులను నిరసిస్తు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు మూల అల్లూరిరెడ్డి, జిల్లా కోశాధికారి దారివేమలు శరణ్‌ కుమార్‌ బాబీ, ఎలకా్ట్రనిక్‌ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్‌ బాజీ వలి, మార్కాపురం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు డి.మోహన్‌రెడ్డి, ఐజేయూ మాజీ సభ్యుడు జీఎల్‌ నరసింహారావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభ్యుడు షేక్‌ అజ్మతుల్లా, సుబ్రహ్మణ్యం, ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : ఉగ్ర దాడిని ఖండిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రజలు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.

గిద్దలూరు : ఉగ్ర దాదిడిని రిటైర్డ్‌ ఉ ద్యోగులు, ఉపాధ్యాయులు ఖండించారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, రంగయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 11:03 PM