Share News

ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:55 PM

ఎస్పీ తుషార్‌ డూడీ గురువారం రాత్రి చీరాల పట్టణం, పేరాల ప్రధాన సెంటర్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా చేశారు.

ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న ఎస్పీ తుషార్‌ డూడీ

చీరాల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఎస్పీ తుషార్‌ డూడీ గురువారం రాత్రి చీరాల పట్టణం, పేరాల ప్రధాన సెంటర్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అలాగే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేస్తున్న సమయంలో సమీప బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందు బాబులు పరుగులు తీశారు. జిల్లాలో ఏకకాలంలో జరిగిన ఆకస్మిక తనిఖీలతో వాహనదారులు, నేరగాళ్లు ఉలిక్కిపడ్డారు. అనుకోకుండా పోలీస్‌ బాస్‌ రావడంతో స్థానిక పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Updated Date - Apr 17 , 2025 | 11:55 PM