Share News

సెలవుపై తహసీల్దార్‌

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:24 AM

జిల్లా నడికూడలిలోని పొదిలి మండలానికి వారం రోజులుగా తహసీల్దార్‌ లేకపోవడంతో రెవె న్యూ కార్యాకలాపాలు స్తంభించాయి.

సెలవుపై తహసీల్దార్‌

పొదిలి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నడికూడలిలోని పొదిలి మండలానికి వారం రోజులుగా తహసీల్దార్‌ లేకపోవడంతో రెవె న్యూ కార్యాకలాపాలు స్తంభించాయి. వివిధ పనులకోసం ప్రజలు కార్యాలయం చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్‌ కృష్ణారెడ్డి వారం రోజుల క్రితం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆ తరువాత కార్యాలయాన్ని పట్టించుకున్నావారు లేరు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? లేదా..? వ్యక్తిగత అవసరాలు ఉన్నాయా..? అనే చర్చ పట్టణంలో జరుగుతోంది. ఇటీవల కాలంలో పట్టణంలో భూఆక్రమణలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో తహసీల్దార్‌ సెలవుపై వెళ్లడం తో పట్టణ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తహసీల్దార్‌ లేకపోవ డంతో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, భూసంబంధ సమస్య ల కోసం వచ్చే రైతులు, వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా రు. ఆదాయ ధ్రువీకరణ, కులం, ఈడబ్ల్యూఎస్‌ తదితర పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అవి మంజూరు కావడం లేదు. వీఆర్వో, ఆర్‌ఐల సంతకాలు పూర్తయ్యి తహసీల్దార్‌ లేక పోవ డంతో అవి కట్టలుగా తహసీల్దార్‌ టెబుల్‌పై దర్శనమిస్తున్నాయి. దీంతో తమ ధ్రువీకరణ పత్రాలు ఏమయ్యాయో తెలీక విద్యార్థులు నిత్యం కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తు న్నారు. కీలకమైన మండలం కావడంతో శాంతిభద్రతల సమస్యను సైతం పర్యావేక్షిం చాల్సిన మెజిస్టీరియల్‌ అధికారాలు ఉన్న తహసీల్దార్‌ లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. 32 రెవెన్యూ గ్రామాలు కలిగిన అతి పెద్ద మండలానికి రెవెన్యూ అధికారి సెలవు పై వెళ్లినప్పటికి పూర్తిస్థాయి రెవెన్యూ బా ధ్యతలు ఎవరికీ అప్పగించకపోవడంపై ప్రజ లు విమర్శిస్తున్నారు. తహసీల్దార్‌ లేక పోవ డంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో క్షేత్రస్థాయి రెవె న్యూ సిబ్బంది ఆటవిడుపుగా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి అదనపు భాధ్యతలతో తహసీ ల్దార్‌ను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:24 AM