ఉగ్ర దాడి అమానుషం
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:51 PM
పర్యాటకులపై అత్యంత పాశవికంగా ఉగ్ర వాదులు దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. గురువారం రాత్రి టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాదాలు చేశారు. దీంతో చీరాల హో రెత్తింది.
ఎమ్మెల్యే కొండయ్య
కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ
చీరాల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : పర్యాటకులపై అత్యంత పాశవికంగా ఉగ్ర వాదులు దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. గురువారం రాత్రి టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాదాలు చేశారు. దీంతో చీరాల హో రెత్తింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవత్వాన్ని మరచి క్రూరంగా హత్యకు పాల్పడిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసిందన్నారు. ఉగ్రవాదాన్ని అంత మొందించేందుకు దేశరక్షణ విభాగం ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు. బాధిత కుటుంబానికి కన్నీటి వీడ్కో లు తెలిపారు. అలాగే కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నేత ఆమంచి స్వాములు, టీ డీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు. హిందు సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ అనంతరం పాకిస్థాన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
న్యాయవాదుల నిరసన
పర్చూరు : కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ పర్చూరు కోర్టు బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ మేరకు వారు విధులను బహిష్కరించారు. కార్యక్రమం లో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు పూరిమెట్ల జాన్‌బాబు కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.