ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:45 PM
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పాల్గొని సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.
ఎమ్మెల్యే కొండయ్య
చీరాల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పాల్గొని సమస్యలపై ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. 219 అర్జీలు రాగా, అందులో నివేశన స్థలాలు 134, పెన్షన్ 70, రేషన్‌కార్డులు 10, మరో ఐదు ఇతరవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందిన అర్జీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని తెలి పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దనరావు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.