గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:58 PM
దర్శి పట్టణంలోని గడియారస్తంభం కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఈ స్తంభం నిర్మించారు. నిర్మాణం సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ముందుచూపు లేకుండా ఒకవైపు నిర్మించారు. దీంతో ఆ సర్కిల్‌లో పెద్ద వాహనాలు తిరిగేందుకు వీలులేకుండా ఇబ్బందిపడే పరిస్ధితి నెలకొంది. కాలక్రమంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరగటంతో అక్కడ తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
దర్శి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలోని గడియారస్తంభం కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో ఈ స్తంభం నిర్మించారు. నిర్మాణం సమయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ముందుచూపు లేకుండా ఒకవైపు నిర్మించారు. దీంతో ఆ సర్కిల్‌లో పెద్ద వాహనాలు తిరిగేందుకు వీలులేకుండా ఇబ్బందిపడే పరిస్ధితి నెలకొంది. కాలక్రమంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరగటంతో అక్కడ తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న గడియారస్తంభం తొలగించాలని రెవెన్యూ, నగర పంచాయతీ అధికారుల నిర్ణయించారు. గడియార స్తంభం కూల్చవద్దని రోటరీ క్లబ్‌కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే, ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్నందున తొలగించాల్సిన అవసరం ఏర్పడిందని నగర పంచాయతీ అధికారులు కోర్టుకు వివరణ ఇవ్వటంతో అడ్డంకులు తొలగిపోయినట్లు కమిషనర్ మహేశ్వరరావు తెలిపారు. ఈక్రమంలో గడియార స్తంభాన్ని ఏ సమయంలోనైనా కూల్చివేసే అవకాశం ఉంది.