Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:54 AM

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలోని చైతన్యనగర్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 1 ( ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలోని చైతన్యనగర్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల 1వ తేదీన వృద్ధులకు దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఉద యం 7 గంటల నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి, ఎన్ట్‌ఆర్‌ భరోసా ఫించన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. వృద్ధ మహిళల కళ్లలో సంతోషం వ్యక్తమౌతోందన్నారు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు, తలసేమియా బాధితులకు రూ.15 వేలు, మూత్రపిండాల డయాలసిస్‌ రోగులకు రూ.10 వేలు వంతున పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలంలో 8277మంది లబ్ధిదారులకు నెలకు రూ.3.60 కోట్లు పింఛన్ల సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో సాయత్ర:ం 7 గంటలలోపు 94 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్‌ పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ రాజశేఖరరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు వేగినాటి శ్రీను, చిట్యాల వెంగల్‌రెడ్డి, తోట మహేష్‌, మంత్రునాయక్‌, సత్యనారాయణ గౌడ్‌, ఓర్సు వెంకటేశ్వర్లు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఫించన్ల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజాసంక్షేమం, నియోజకవర్గాల అభివృద్దికి ప్రాధా న్యత ఇస్తూ పాలన సాగిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బైలడుగు బాలయ్యయాదవ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, సర్పంచ్‌ పసుపుల మల్లేశ్వరరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:54 AM