నాటి వైసీపీ పాలన పాపం - రాళ్లవాగుకు శాపం
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:30 AM
అర్థవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రాళ్లవాగుకు జగన్‌పాలన శాపంగా మారింది.

కంభం (అర్థవీడు), మార్చి 31 (ఆంధ్ర జ్యోతి): అర్థవీడు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రాళ్లవాగుకు జగన్‌పాలన శాపంగా మారింది. టీడీపీ హాయంలో ఈ పనులు ప్రారంభమైనప్పటికీ, వైసీపీ హయాంలో పూర్తిగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభు త్వంపై దీని నిర్మాణ బాఽధ్యత ఉంది.
నల్లమల అటవీ ప్రాంతమైన పాపినేనిపల్లె వద్ద అంకభూపాలెం పంచాయతీ సమీపం లోని రెండు కొండల మధ్య సహజసిద్ధంగా రాళ్లవాగు ఆనకట్ట నిర్మించాల్సి ఉంది. రూ.22 కోట్లతో దీని నిర్మాణ పనులు టీడీపీ హయాంలో ప్రారంభించారు. వెలిగొండ ప్రాజె క్టు అనుబంధ ప్రాజెక్టుగా దీని పనులు ప్రారంభించారు. టీడీపీ హయాంలో పునాదు లు వేసి పనులు ప్రారంభించారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆనకట్ట నిర్మాణం పూర్తయితే 1500 ఎకరా లకు సాగు, 12 గ్రామాలకు తాగునీరు లభి స్తుంది. 0.138 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తో జలాశయం అర్థవీడు మండలానికి వరంగా మారుతుంది. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం తోడై గత ప్రభుత్వ హ యాంలో కనీసం తట్టమట్టి కూడా పోయ లేదు. మట్టి, ఇసుక, రాళ్ల కొరతను చూపి పనులను పక్కనపెట్టారు. ఈ ఆన కట్ట నిర్మాణం పూర్తయితే ఐదేళ్లలో రాళ్లవాగుకు వచ్చిన వరదలతో జలాశయం నిండుకుండాల ఉండేది.
ముడిసరుకు సరఫరా చేయలేక
పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఈ ఆనకట్ట నిర్మాణానికి స్థానిక నాయకులే కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ముడి సరుకుకు తగిన ధరలకు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జలాశయ నిర్మాణానికి అవసరమైన మట్టి, ఇసుక, రాళ్లు సరఫరా చేయకపోవడం, కాంట్రాక్టర్‌లు సబ్‌కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించడంతో ఆనకట్టు పనులు నాలుగేళ్లుగా పునాది దశలో ఆగిపోయాయి. నల్లమల అడవుల నుంచి ప్రవహించే నీరు రాళ్లవాగు ఆనకట్ల పూర్తి కాకపోవడంతో వరద నీరు జంపలేరువాగు నుంచి వృథాగా పోతోంది. ఆనకట్ట నిర్మాణం పూర్తయితే, వరద నీరు మిగిలి భూగర్భ జలాలు పెరిగేవి. కూటమి ప్రభుత్వం రాకతో రాళ్లవాగు ఆనకట్ట నిర్మాణం పూర్తిచేసి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చాలని అర్థవీడు మండల ప్రజలు కోరుతున్నారు.