నేడు చంద్రబాబు జన్మదినోత్సవం
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:00 AM
తెలుగుదేశం పార్టీ అఽధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన 76వ ఏట అడుగుపెడుతుండటం, తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి జన్మదినం కావడంతో భారీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు.
భారీ కార్యక్రమాలకు తెలుగు తమ్ముళ్ల సన్నాహాలు
ఒంగోలు, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ అఽధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన 76వ ఏట అడుగుపెడుతుండటం, తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి జన్మదినం కావడంతో భారీ కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, నియోజకవర్గ, మండలకేంద్రాలతోపాటు పలు గ్రామాల్లోనూ ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పెద్దఎత్తున కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదానం, మెడికల్ క్యాంపులు వంటివి నిర్వహించనున్నారు. ఇప్పటికే టీడీపీ కీలక నేతలు కిందిస్థాయి నాయకులకు ఇందుకు సంబంధించిన కార్యక్రమా లపై పలు సూచనలు చేయగా తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి స్వామి నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వంటి వారంతా తమ తమ ప్రాంతాల్లో ఈ వేడుకలకు హాజరు కానున్నట్లు సమాచారం.