Share News

ట్రెజరీ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:08 PM

ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ట్రెజరీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి.

ట్రెజరీ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
అసోసియేషన్‌ జిల్లానూతన కార్యవర్గంతో ఎన్జీవో నేతలు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి) : ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ట్రెజరీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా పి.కిరణ్‌కుమార్‌, సహాయ ఎన్నికల అధికారిగా సీహెచ్‌ విజయకృష్ణ, పరిశీలకులుగా డి.రమణారెడ్డిలు వ్యవహరించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎన్‌వీ కృష్ణ(మార్కాపురం), కార్యదర్శిగా పి. అంకబాబు(ఒంగోలు), సహాధ్యక్షులుగా పీవీఎల్‌ఎన్‌ రవికుమార్‌(గిద్దలూరు)లు ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలుగా కె. లావణ్య(ఒంగోలు), బి. అక్కేశ్వరరావు(ఒంగోలు), కె. కరీముల్లా(పొదిలి), కె. వెంకటేశ్వర్లు(మార్టూరు), మహిళా సంయుక్త కార్యదర్శులుగా పి.హేమలత(మార్కాపురం), కె. ప్రసాద్‌(కనిగిరి), డి.అనిల్‌(వైపాలెం), కోశాధికారిగా కె.రామకృష్ణ(ఒంగోలు)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా సీహెచ్‌ ఫణింద్ర(కందుకూరు), ఐ. కిషోర్‌బాబు(ఒంగోలు)లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం అనంతరం ప్రమాణస్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులను ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే శరత్‌బాబు, ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డిలు అభినందించారు.

Updated Date - Apr 27 , 2025 | 11:08 PM